Thursday, May 16, 2024

Disapathani : కల్కి సెట్స్‌లో…

కథానాయకుడిగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా తెరకెక్కుతోంది. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌ చిత్రమిది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మహాభారతం కాలం నుంచి మొదలై 2898 వరకు జరిగే కథతో రూపొందుతోంది. ఇందులో భారతీయ ఇతిహాసాలను చూపిస్తున్నారు.

- Advertisement -

ప్రభాస్‌తో పాటుగా అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిపికా పదుకునె, దిశాపటాని నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ వివిధ లొకేషన్స్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఇటలీలో ప్రభాస్‌ దిశాపటానిపై ఓ రొమాంటిక్‌ పాటని చిత్రీకరించారు. ఇక్కడి సెట్స్‌ నుంచి కొన్ని వర్కింగ్‌ చిత్రాలు వైరల్‌ అయ్యాయి. పాట చిత్రీకరణ పూర్తికావడంతో లొకేషన్‌లో దీగిన ఫోటోలను నటి దిశా పటానీ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. వీటిలో ప్రభాస్‌తో దిగిన సెల్ఫీ కూడా ఉంది. ఇంకా లొకేషన్‌ స్టిల్స్‌ సైతం దిశా ఇన్‌స్టాలో దర్శనమిస్తున్నాయి. ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement