Friday, April 26, 2024

నెల రోజులు ఏకధాటిగా…పుష్ప కోసం !!

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక మలయాళ స్టార్ నటుడు ఫహాద్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ దుమ్ము దులుపుతుంది.

ఇదిలా ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం జూలై మొదటి వారం నుంచి షూటింగ్ ను స్టార్ట్ చేయబోతోంది. కాగా అందుకోసం హీరోయిన్ రష్మిక మందన్న బాల్క డేట్స్ ను ఈ మూవీ కోసం కేటాయించదట. జూలై 7న ఆమె షూటింగ్ లో జాయిన్ అవుతుందని సుమారు నెల రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది. కాగా ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement