Monday, May 6, 2024

పుష్ప లో రష్మీక పాత్ర ఎలా ఉంటుందో తెలుసా ? ఆమె మాటల్లోనే!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తోంది. అయితే తాజాగా రష్మీక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. తన పాత్ర అభిమానులను ఆశ్చర్యపడేలా ఉంటుందని ఈ పాత్రలో నటనకు చాలా అవకాశాలు ఉన్నాయని… కచ్చితంగా తనకు మంచి పేరు ను తీసుకు వస్తుందని చెప్పుకొచ్చింది.

అలాగే రెండో భాగంలో కూడా తాను కనిపిస్తానని క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మడు. ఇక ఇప్పటికే రష్మీక లుక్ ని చూస్తే ఒక విలేజ్ గర్ల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా అర్థం అవుతోంది. మొత్తం మీద రష్మిక పాత్ర ఎలా ఉంటుంది ఆమెను దర్శకుడు ఏ విధంగా చూపించబోతున్నారు అనేది ఫ్రాన్స్ లో ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement