Friday, May 17, 2024

జూలై7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానున్న.. రంగ‌బ‌లి

జూలై7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది రంగ‌బ‌లి మూవీ. ఈ చిత్రంలో హీరోగా నాగ‌శౌర్య న‌టిస్తున్నాడు. పవన్ బాసంసెట్టి దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.. జూలై 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన టైటిల్ పోస్టర్ తో పాటు వీడియో గ్లింప్స్ ను పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రాన్ని బట్టి ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ వినోదాత్మక కథాంశంతో తెరకెక్కనున్నట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా.. దివాకర్ మణి ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు.కాగా హీరో నాగశౌర్యకు ఇది 23వ సినిమా.

Advertisement

తాజా వార్తలు

Advertisement