Tuesday, April 30, 2024

ఆచార్య – సిద్ధ నీలంబరిల రొమాంటిక్ స్టిల్ రిలీజ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా….రామ్ చరణ్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

ఇదిలా ఉండగా ఉగాది పండుగ సందర్భంగా ఆచార్య నుంచి సిద్ధ నీలంబరిలా లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. సిద్ధ నీలంబరీల ప్రేమ షడ్రుచుల సమ్మేళనం అంటూ ఓ రొమాంటిక్ లుక్ ను విడుదల చేశారు. కాగా ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement