Friday, April 26, 2024

ఎన్టీఆర్ షో కు గెస్ట్ గా రామ్ చరణ్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రోమో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ షో లో మొదటి గెస్ట్ ఎవరు అనే దాని పై రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడట.

రామ్ చరణ్ ఎన్టీఆర్ కు ముందు నుంచి మంచి స్నేహం ఉంది. అది త్రిబుల్ ఆర్ సినిమా తో మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ అయితే సినిమాకి ప్రమోషన్స్ అలాగే షో కి రేటింగ్ కూడా బావుంటుందని నిర్వాహకులు భావిస్తున్నారట. మరి చూడాలి రామ్ చరణ్ గెస్ట్ గా వస్తారా లేదా అనేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement