Sunday, April 28, 2024

రాజరాజ చోర ప్రీ రిలీజ్ ఈవెంట్…ఎప్పుడో తెలుసా ?

హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాజరాజ చోర. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్ గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది.

రాజరాజ చోర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్ట్ 15న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని దశపల్లా లో నిర్వహించనున్నట్లు తెలిపారు. చోరుడు వస్తున్నాడు…జాగ్రత్త. ఎవరు వస్తువులకు వాళ్లే బాధ్యులు అంటూ సాగే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement