Tuesday, April 30, 2024

Rajamouli : ప్ర‌భుదేవా పాట‌కు రాజ‌మౌళి స్పెప్పులు ..

దర్శక దిగ్గ‌జం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజ‌మౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే వర్క్‌ విషయంలో ఎంతో సీరియస్‌గా ఉండే జ‌క్క‌న్న పర్సనల్‌ లైఫ్‌లో సరదాగా ఉంటారు.

- Advertisement -

టైం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి వేకేష‌న్‌కు చెక్కేస్తాడు. అయితే జక్క‌న్న రీసెంట్‌గా త‌న‌లోని డ్యాన్స‌ర్‌ను బ‌య‌టికి తీశాడు. ఇటీవలే జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తన సతీమణి రమతో కలిసి ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’ పాటకు స్టేజ్‌పై రాజ‌మౌళి డ్యాన్స్‌ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైర‌ల్ అయ్యింది. అయితే రీసెంట్‌గా ఈ పాట‌కు రాజ‌మౌళి, రమా క‌లిసి రిహార్సల్స్ చేసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. #SSMB29గా ఈ సినిమా రానుంది. యాక్షన్‌ అడ్వెంచర్‌గా రానున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో వ‌స్తున్న ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా నటించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement