Thursday, April 25, 2024

రాజా విక్రమార్క…కొత్త పోస్టర్ రిలీజ్

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. కార్తికేయ ప్రస్తుతం శ్రీ సరిపల్లి దర్శకత్వంలో రాజా విక్రమార్క సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ మొన్న రిలీజ్ చేయగా… తాజాగా మరో కొత్త పోస్టర్ నుచిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

అందరికీ ఈద్ ముబారక్ అంటూ ఈ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శ్రీ సరిపల్లి అల్లుడు శ్రీను, నాయక్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక తన్య రవిచంద్ర హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement