Wednesday, July 28, 2021

బైక్ అదుపుతప్పి తండ్రి, కుమారుడు మృతి

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగా బైక్ అదుపుతప్పి ట్రాక్టర్ కింద పడటంతో తండ్రి, కుమారులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులను కొండెబోయిన కొండల్‌ (34), శివనాగరాజు (13)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల కుటుంబీలకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని ప్రమాదంలో తండ్రీకుమారులిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ఈ వార్త కూడా చదవండి: మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News