Friday, May 3, 2024

జాతిరత్నాలు మధ్య గొడవ…వీడియో సాక్ష్యం !!

నటుడు రాహుల్ రామకృష్ణ హీరో నవీన్ పోలిశెట్టి కు వార్నింగ్ ఇచ్చారు. అవును మీరు విన్నది నిజమే!! అయితే ఇది సీరియస్ వార్నింగ్ కాదు. డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి ,రాహుల్ రామకృష్ణ, ప్రధాన పాత్రలు ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం జాతిరత్నాలు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్ళను కూడా సాధించింది. ఇక విజయోత్సవ వేడుకలలో భాగంగా నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి అమెరికా వెళ్లారు. అక్కడ టూర్ కు సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలను చూసిన రాహుల్ తనని తీసుకు వెళ్ళకుండా వెళ్లడంపై ఫన్నీ కామెంట్ చేశారు.

అరేయ్‌ దర్శి, నవీన్‌.. పీపుల్స్‌ ప్లాజాలో సక్సెస్‌మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్‌ వెళ్లిపోతారేరా.! నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్‌ కార్డ్‌ ఉందని. పాన్‌కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా.. జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్‌ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా మీరు రండ్రా… మీ సంగతి చెబుతా..అంటూ రాహుల్‌ ఓ సరదా వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

https://twitter.com/eyrahul/status/1373299863706726410?s=24
Advertisement

తాజా వార్తలు

Advertisement