Friday, May 3, 2024

కరోనా చేతిలో షర్మిల !!

వైయస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జిల్లాల నేతలతో సమావేశం అవుతున్న షర్మిల… ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఈ సభలోనే పార్టీ పేరును కూడా ప్రకటిస్తానని షర్మిల చెప్పింది. పార్టీ విధి విధానాలు కూడా చెప్పబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే పోలీసులు కూడా సభకు అనుమతులు ఇచ్చారు. దీంతో గవర్నమెంట్ నుంచి లైన్ క్లియర్ అయింది.

అయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అయితే కర్ఫ్యూలు కూడా విధిస్తున్నారు. తెలంగాణలో కూడా త్వరలో లాక్ డౌన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందనిపిస్తుంది. అదే కనుక జరిగితే షర్మిల సభకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే ఏంటి పరిస్థితి అనే అనుమానాలు ఆమె కార్యకర్తలు, అభిమానులలో కలుగుతున్నాయి. ఇప్పటికే కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వాలతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సమావేశమయ్యారు.

మరోవైపు నెల 22 నుంచి కాలేజీలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా మళ్లీ వెనక్కి తగ్గింది. 8వ తరగతి వరకూ పాఠశాలలను మూసేయాలని ఆలోచన ఉన్నట్టు కెసిఆర్ ప్రకటించారు. అయితే ఇటువంటి సమయంలో ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల భారీ బహిరంగ సభ నిర్వహించడం కు అడ్డంకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక కనీసం లక్ష మందికి తగ్గకుండా సభను విజయవంతం చేయాలన్న పట్టుదలతో వైయస్ షర్మిల ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ సభ జరగాలంటే మొత్తం మహమ్మారి కరోనా చేతుల్లోనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement