Saturday, April 27, 2024

రాహుల్ ద్రావిడ్ బయోపిక్ @సిద్దార్థ్ ?

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా హీరో సిద్ధార్థ్ ప్రముఖ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ బయోపిక్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ద వాల్ గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే రాహుల్ ద్రావిడ్ అప్పట్లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. విశేషమైన సేవలు అందించారు.

అయితే రాహుల్ ద్రావిడ్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తే తెలుగు, తమిళ ,కన్నడ అభిమానులే కాకుండా అందరూ చేస్తారనే నమ్మకంతో ఆ బయోపిక్ ను రెడీ చేసుకున్న మేకర్స్ రాహుల్ ద్రావిడ్ ను కలిసి స్క్రిప్ట్ కూడా వినిపించి అనుమతి తీసుకున్నారట. అయితే ద్రావిడ్ గా సిద్దార్థ్ ను అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించి కన్ఫర్మేషన్ ఎక్కడ రాలేదు. కానీ ఈ అవకాశం వస్తే మాత్రం తప్పకుండా సిద్దార్థ్ ఒప్పుకుంటాడాని అంటున్నారు విశ్లేషకులు. ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక ద్రావిడ్ బయోపిక్ ను చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement