Wednesday, April 24, 2024

వైరల్… మీ దగ్గర ఈ రూ.2 నాణెం ఉంటే లక్షాధికారి మీరే

నాణేల వాడకం రెండు వేల సంవత్సరాల క్రితం మొదలైనట్లు చరిత్ర చెబుతోంది. అయితే కాల క్రమేణా కొన్ని కనుమరుగైపోయాయి. అయితే పెద్దలు ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని వూరికే చెప్పలేదు. 1994, 1995, 1997, 2000 సంవత్సరాలకు చెందిన 2 రూపాయల నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చు. అరుదైన నాణేలను సేకరించే అలవాటు ఉంటే.. రూ .5 లక్షలు సంపాదించవచ్చు. బెంగళూరుకు చెందిన ‘క్వికర్’ వెబ్‌సైట్‌లో చాలా మంది కొనుగోలుదారులు ఈ పాత, అరుదైన నాణానికి భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది .

అంతేకాకుండా పాత ఫీచర్లతో ఉన్న రూ .10 నోట్‌ ఆన్‌లైన్‌లో కాయిన్‌బజార్ ప్లాట్‌ఫామ్‌లో విక్రయించవచ్చు. ఈ అరుదైన పాత నోట్లు, నాణేల కోసం కొనుగోలుదారులు వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు వినికిడి. అయితే నోటులో ఒక వైపు అశోక స్తంభం, మరో వైపు పడవ ఉండాలి. ఈ నోట్‌ను 1943 సంవత్సరంలో జారీ చేసి ఉండాలి. ఇక ఈ నోట్‌లో అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ సంతకం ఉండాలి. ఇది కాకుండా, 10 రూపాయలు అని ఆంగ్ల భాషలో నోట్ రెండు చివర్లలో.. వెనుక వైపు రాసి ఉండాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement