Thursday, April 25, 2024

రాధే శ్యామ్ హిందీ థియేట్రికల్ రైట్స్ పై కొత్త గాసిప్

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. యూరప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓవర్సిస్ లో బిజినెస్ పై ఓ వార్త బయటకు వచ్చింది.

ఇప్పుడు తాజాగా హిందీ థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. ప్రభాస్ గత చిత్రం సాహో కి హక్కులు సొంతం చేసుకున్న టీ సిరీస్ వారే కొనుగోలు చేశారట. అయితే ఈ సినిమా కూడా భారీ మొత్తంలోనే చెల్లించినట్లు తెలుస్తోంది. సరైన ఫిగర్ మాత్రం బయటకు రాలేదు. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందొ తెలియాలంటే ఎవరో ఒకరు యూనిట్ నుంచి స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement