Saturday, May 8, 2021

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన పోలీస్ కమిషనర్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ సంబంధించి 66డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండంతో సుబేదారి, కేయూసి, ఇంతేజార్ గంజ్, మట్వాడా, మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సెంట్రల్ జోన్ డి.సి.పి పుష్పా, ఎ.సి.పిలు జితేందర్ రెడ్డి, గిరికుమార్, ప్రతాప్ కుమార్ మరియు స్థానిక ఇన్స్‌పెక్టర్లతో కల్సి సందర్శించారు. ఈ సందర్బంగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును పోలీస్ కమిషనర్ పర్యవేక్షిండంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీంగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు శానిటైజర్లు, మాస్క్ లు, ఫేస్ షీల్డ్ వినియోగంపై పోలీస్ కమిషనర్ అరా తీసారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News