Monday, April 29, 2024

పుష్ప‌2.. విల‌న్ వ‌చ్చేశాడు

పుష్ప‌2 అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్.ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. పుష్ప‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తిరుగులేని పాపులారిటీ వచ్చింది. ఇక పుష్పలో బన్నీ తర్వాత ఆ స్థాయిలో మెరిసిన పాత్ర భన్వర్‌సింగ్‌ షెకావత్‌. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ఈ పాత్రలో నటించారు. కనిపించింది కాసేపే అయినా తన నటనతో మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాడు. ఇక సెకండ్‌ పార్ట్‌లో ఫాహద్ పాత్ర వేరే లెవల్లో ఉంటుందని చిత్రబృందం గతంలోనే చెప్పారు. ఇక ఫాహద్‌ కు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను మేకర్స్‌ కంప్లీట్‌ చేసినట్లు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు షూటింగ్‌ లోకేషన్‌లో సుక్కు, ఫాహద్‌ మానిటర్‌ స్క్రీన్‌ను చూస్తున్న ఫోటోను పంచుకున్నారు. అంతేకాకుండా ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడు అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు.ఇప్పుడీ ఫొటో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement