Sunday, April 28, 2024

పుష్ప‌2సెట్ లో.. ఫ‌హ‌ద్ ఫాజిల్

పుష్ప‌2 సెట్ లో సంద‌డి చేశారు న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్.. పుష్ప.. ది రూల్‌ చిత్రాన్ని 2024 ఫస్ట్‌ హాఫ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్‌. విడుదల తేదీపై సరైన సమయంలో క్లారిటీ ఇవ్వనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సీక్వెల్‌లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం పుష్పరాజ్‌ టీం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సహా ఇతర యాక్టర్ల మధ్య వచ్చేయాక్షన్‌ సన్నివేశాలను ఈ చిన్న షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. మారేడుమిల్లితోపాటు ఒడిశా పరిసర ప్రాంతాల్లో తాజా షెడ్యూల్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌ తర్వాత బన్నీ టీం నయా షెడ్యూల్‌లో భాగంగా విదేశాలకు వెళ్లనుంది. యూరప్‌తోపాటు బ్యాంకాక్‌లో కీలక సన్నివేశాలను షూట్‌ చేయబోతున్నారని సమాచారం.షూటింగ్ లొకేషన్‌లో ఫారెస్ట్‌ ఆఫీసర్లతో ఫహద్ ఫాజిల్‌ అండ్‌ సుకుమార్‌ టీం ఉన్న స్టిల్స్ కొన్ని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement