Tuesday, April 30, 2024

పుష్ప‌2.. ఛాలెంజింగ్ రోల్ లో జ‌గ‌ప‌తిబాబు

సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు ప్ర‌స్తుతం విల‌న్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముఖ్య పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. నెగెటివ్ షేడ్స్ తోనూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అభిమానులు, ఆడియెన్స్ కూడా ఆదరించడంతో భారీ చిత్రాల్లో జగపతి బాబు కీలక పాత్రలను దక్కించుకుంటున్నారు. బాలయ్య నటించిన ‘లెజెండ్’ చిత్రంలో విలన్ గా అవతారం ఎత్తిన జగపతి బాబు ఇండస్ట్రీలో బిజీగా మారిపోయాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో తన సత్తా చాటుతున్నారు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, గూఢచారి, రాధే శ్యామ్, గని, వంటి చిత్రాల్లో విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే.

కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2: ది రూల్’ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సీక్వెల్ లో మరిన్ని పాత్రలు యాడ్ కానున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందులో జగపతి బాబు పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇక తాజాగా ‘పుష్ప2’లో తాను నటిస్తున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. జగపతి బాబు మాట్లాడుతూ.. సుకుమార్ తో కలిసి పనిచేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. Pushpa 2లో ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నాను. అలాంటి క్యారెక్టర్స్ చేయడమంటే నాకెంతో ఇష్టం. సుక్కుతో సినిమా అంటే ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను. దాదాపు 20 ఏళ్ల కింద అల్లు అర్జున్ జిమ్ లో చూశాను. అప్పుడు బన్నీ నాకు ఎవరో తెలియదు. తను హార్డ్ వర్క్ చేయడం గమనించాను. బన్నీని చూస్తుంటే గర్వంగా ఉంది.’ అంటూ ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement