Thursday, May 16, 2024

మీరు చాలా ప్రత్యేకమైన వారు….ఎన్టీఆర్ కు అత్త విషెస్

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే ఎన్టీఆర్ అత్త బిజెపి మహిళా నేత పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా…. మీరు చాలా ప్రత్యేకమైన వారు. అందుకే మీ మనోహరమైన ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. హ్యాపీ బర్త్ డే రాక్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు పురందేశ్వరి.

ఇంకా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అంతా కూడా సోషల్ మీడియాలో మొన్నటినుంచి హంగామా స్టార్ట్ చేశారు. ఇక నిన్నటి నుంచి హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement