Thursday, May 2, 2024

ఎన్టీఆర్ తో సినిమా మిస్ కావడం పట్ల నాగ వంశీ రియాక్షన్ ఎంటో తెలుసా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రానే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మొదటిగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఊహించని పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్ తో సినిమా మిస్ అయిందని కానీ ఎన్టీఆర్ ప్రాజెక్టుపై అదే ఉత్సుకతతో ఉన్నామని నాగ వంశీ చెప్పుకొచ్చారు.

రాబోయే రోజుల్లో తమ కాంబినేషన్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సినిమా అనౌన్స్ చేయక ముందు హారిక అండ్ హాసిని బ్యానర్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 వ సినిమా చేయబోతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement