Saturday, April 20, 2024

టక్ జగదీష్ రిలీజ్ వాయిదా

శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం లో హీరోయిన్ గా రీతూవర్మ నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పుడు టక్ జగదీష్ సినిమా కూడా రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది.

ఈ మేర నాని ఓ వీడియో ని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో నాని మాట్లాడుతూ క్రాక్ సినిమా నుంచి వకీల్ సాబ్ సినిమా వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి. అలాగే ఏప్రిల్ 23న రాబోయే టక్ జగదీష్ సినిమా కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా టక్ జగదీష్ ని కొంచెం వెనక్కి జరుపుతున్నాము అంటూ నాని చెప్పుకొచ్చాడు. ట్రైలర్ రిలీజ్ అయిన రోజు డేట్ ని కూడా అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement