Friday, May 3, 2024

పవన్ కోసం అప్పుడే దిల్ రాజు దర్శకుడి వేట ?

పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో మూడు నాలుగు సినిమాలను కూడా లైన్ లోపెట్టాడు.

అయితే తాజాగా దిల్ రాజుకు మరో అవకాశంను పవన్ ఇచ్చినట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు అప్పుడే దర్శకుడిని వెతికే పనిలో పడ్డారట. ఈ సినిమాకు ఓ సీనియర్ దర్శకుడు అయితే బాగుంటుందని పవన్ కూడా తెలిపడట. ఈ నేపథ్యంలోనే సీనియర్ దర్శకుడిని వెతికే పనిలో పడ్డారట దిల్ రాజు.

Advertisement

తాజా వార్తలు

Advertisement