Thursday, May 16, 2024

ఉద్యోగుల‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు ఉచిత వ్యాక్సినేష‌న్ – ఐటి సంస్థ‌ల నిర్ణ‌యం

హైదరాబాద్‌, : కరోనా సెకండ్‌వేవ్‌తో దేశం, రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరిగి ఎక్కువ మంది మృ త్యువాత పడుతుండడంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇతర కంపె నీలకు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నాయి. ఐటీ కంపె నీల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఉచితంగా టీకా వేయించేందుకు నడుం బిగించాయి. కేవలం ఉద్యోగులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా టీకా వేయించాలని నిర్ణయించాయి. దీంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఐటీ రంగంలో పనిచేస్తున్న 5 లక్షల మంది ఉద్యోగులకు కొవిడ్‌ విషయంలో కాస్త ఉపశమనం లభించినట్లయింది. కరోనా రెండోవేవ్‌లో మొదటి వేవ్‌ కంటే ఎక్కువగా విజృంభిస్తుండడంతో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు, సంస్థలు నేరుగా మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసుకోవడానికి అను మతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న ఫార్మా కంపె నీలతో పాటు ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్‌ను దిగుమతి చేసు కుని ఇండియాలో మార్కెటింగ్‌ చేసే కంపెనీలతో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా వంటి పేరు మోసిన ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోసం గుంపగుత్తగా టీకా కొనుగోలుకు ఒప్పందం చేసుకునే ప్రయత్నాలను ఇప్పిటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఐటీ కంపెనీలు కేవలం టీకా తయారుచేసే, సరఫరా చేసే ఫార్మా కంపెనీలతోనే కాకుండా త మ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్ణీత వ్యవధిలో దానిని ఇచ్చేందుకుగాను కార్పొ రేట్‌ ఆస్పత్రులతోనూ ఒప్ప ందాలు కుదర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. పెద్ద ఐటీ కంపెనీలన్నింటికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో క్యాం పస్‌లున్నాయి. ఈ కంపె నీల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యో గస్తులు పనిచేస్తుంటారు. దీంతో హైదరాబాద్‌లో ఐటీ ఉద్యో గులకు జూన్‌ నెల తర్వాత కొవిడ్‌ విషయంలో ఎలాంటి ఆందో ళన అవసరం లేదని పలువురు పేర్కొంటున్నారు.
ఐటీ కంపెనీల్లో 80 శాతం దాకా 45 ఏళ్లలోపు వారే…
సాధారణంగా ఐటీ కంపెనీల్లో 80 శాతం దాకా 45 ఏళ్లలోపు యువతే ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తుంటారు. వీరికి కేంద్ర ప్రభుత్వం నిర్వ హించిన రెండు విడతల వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో టీకా లభిం చలేదు. అయితే తాజాగా వ్యాక్సినేషన్‌ విషయంలోఆంక్షలు లేవని, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వచ్చని ప్రకటించడంతో తమ ఉద్యోగులకు టీకా త్వరగా ఇప్పించే విషయంలో ఐటీ కంపెనీలు యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అందుకు సంబంధించి ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నాయని పలు వురు కంపెనీల యాజమాన్య ప్రతినిధులు చెబుతున్నారు.
టీకా తర్వాత వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ నుంచి దశల వారిగా ఉద్యోగులు కార్యాలయాలకు…
తమ ఉద్యోగులకు కొవిడ్‌కు టీకా ఇచ్చే ప్రక్రియ పూర్త యిన తర్వాత వారికి కరోనా సోకే అవకాశాలు తగ్గిపోతాయని, దీంతో వారిని వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ నుంచి దశలవారిగా కార్యాల యాలకు రప్పించి విధులు నిర్వహించేందుకు ఆదేశాలి వ్వవచ్చని ఐటీ కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కార్యాలయాల్లో విధులు నిర్వహించే అవసరమున్న ఉద్యోగులతో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయిస్తుండడంతో ఆప రేషన్స్‌లో పలు సమస్యలు వస్తున్నాయని వారు భావిసు ్తన్నారు. తమ కంపెనీలకు మూల ధనం ఉద్యోగులనేని వారి మేధాశక్తితోనే తాము వ్యాపారం చేస్తున్నందున వారి ఆరోగ్యం తమకు అన్నింటికంటే ముఖ్యమని కంపెనీలు పేర్కొం టున్నాయి. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీ క్యాంపస్‌లలోనూ దాదాపు 70 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోంలోనే ఉన్నారు. వీరంతా మొదటి దశ కరోనా ఉత్పాతం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కార్యాలయాలకు విధులు నిర్వహిద్దామనుకునే లోపు సెకండ్‌ వేవ్‌ రూపంలో వైరస్‌ విరుచుకుపడడంతో కంపెనీలు ఇచ్చే టీకా తీసుకుంటే తప్ప బయట అడుగు పెట్టే పరిస్థితి ఉండదన్న నిర్ణయానికొచ్చారు.
ఐటీ కంపెనీల వద్ద భారీగా నగదు నిల్వలు….
తమ ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి కొవిడ్‌ టీకా ఇప్పించడానికి అయ్యే ఖర్చు భరించడం ఐటీ కం పెనీలకు పెద్ద పనికాదని తెలుస్తోంది. సాధారణంగా పేరు మోసిన ఐటీ కంపెనీలకు ఉద్యోగుల జీతాలు, వీసాలు తప్ప పెద్దగా ఖర్చు లేకపోవడంతో వారికి లాభాల మార్జిన్‌ ఎక్కు వగా ఉంటుంది. దీనికి తోడు ఆయా కంపెనీలకు సామర్థ్య విస్తరణకు కూడా పెద్దగా పెట్టుబడి అవసరం లేకపోవడంతో వాటి బ్యాలెన్స్‌ షీట్‌లలో భారీగా నగదు నిల్వలున్నట్లు కంపెనీలే వాటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా వెల్ల డిస్తుంటాయి. దీంతో ఈ కంపెనీలకు ఉద్యోగులకు టీకా ఇప్పి ంచడం పెద్ద పనికాదని పలువురు సీనియర్‌ ఐటీ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐటీ ఉద్యోగుల పర్చేజింగ్‌ పవర్‌తో ఆర్థిక వ్యవస్థకు ఊతం
హైదరాబాద్‌ లాంటి నగరంలో సర్వీసు రంగమే ఆర్థిక వ్యవస్థకు ఊతంగా ఉంటుంది. సర్వీసు రంగానికి ప్రజల కొను గోలు శక్తే ఆధారం. ఐటీ ఉద్యోగులకు సాధారణంగానే జీతాలు భారీగా ఉంటాయి. దీంతో వీరు చేసే ఖర్చు మనీ రొటేషన్‌కు అవకాశం కల్పిస్తుంటుంది. అయితే గతేడాది కొవిడ్‌ మహ మ్మారి రంగ ప్రవేశం తర్వాత ఐటీ ఉద్యోగులు సాధారణంగా బయటికి వచ్చి చేసే ఖర్చు తగ్గిందని పలు నివేదికలు చెబు తున్నాయి. ఉదాహరణకు వీరు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయడం కారణంగా ఎంతో మంది మ్యాక్సీ క్యాబులు నడిపే కాంట్రాక్టు వాహనాల యజమానులు ఉపాధి కోల్పోయి కనీసం వాహ నాలకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి నెలకొంది. అంతేగాక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇళ్ల నుంచే విధి నిర్వహణ చేస్తుండడంతో కార్యాలయాల్లో క్యాంటిన్లు, కార్యాలయాల బయట వీధి వ్యాపారాలు చేసుకునే వారు ఎంతోమందికి గిరాకీ లేక ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తింది. దీంతో పాటు వారంతంలో మిగతా వారితో పోలిస్తే హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లో ఐటీ ఉద్యోగులు మాల్స్‌, రెస్టారెంట్లు, షాపింగ్‌లలో చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే కొవిడ్‌ తర్వాత పరిస్థితిలో మా ర్పు వచ్చి వీరు పొదుపు వైపు పయనిస్తున్నట్లు పలువురు ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. అయితే టీకా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి కార్యాలయాలు ఐటీ ఉద్యోగులతో కలకలలాడి ఆర్థిక వ్యవస్థలో మనీ రొటేషన్‌ ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement