Tuesday, May 7, 2024

వెంకటేష్ తో నటించాలని ఎప్పటినుంచో కోరిక!!

యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రియమణి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలాగే ప్రియమణికి వరుస అవకాశాలు వచ్చేలా చేసింది. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో మెల్లమెల్లగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత కన్నడ, మలయాళ సినిమాల వైపు వెళ్ళింది.

ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అయితే ఆమె పాత్ర గురించి చెబుతూ వెంకటేష్ వెంకటేష్ తో నటించాలనే కోరిక చాలా కాలం నుంచి ఉండేది. ఆయనతో గతంలో అవకాశాలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో మిస్ అయ్యాయి. ఇన్నాళ్లకు సినిమా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకి మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.

Advertisement

తాజా వార్తలు

Advertisement