Monday, April 29, 2024

ప్రశాంత్ వర్మ…కొత్త సినిమా ప్రకటన అప్పుడే !!

ఇటీవల కాలంలో యంగ్ డైరెక్టర్స్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. చాలామంది యంగ్ డైరెక్టర్స్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీస్తున్నారు. అయితే అందులో ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. మొదటి సినిమా అయిన అ!! సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ…. కల్కి, జాంబి రెడ్డి వంటి డిఫరెంట్ స్టోరీస్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అయితే మరో స్టార్ హీరోతో కూడా ఓ సినిమా చేస్తానని ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు. కాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు ప్రశాంత్ వర్మ. కాగా మే 29న ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 29 ప్రశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ తో పాటు డీటెయిల్స్ కూడా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మరి ప్రశాంత్ వర్మ ఎలాంటి సినిమాను అనౌన్స్ చేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement