Monday, April 29, 2024

ప్రశాంత్ వర్మ సూపర్ మ్యాన్…అతనేనా ?

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కొత్త చిత్రంను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రానికి హనుమాన్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. తెలుగులో ఎవ్వరూ టచ్ చేయని సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రశాంత్ వర్మ సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ని అయితే అనౌన్స్ చేసారు గానీ… నటీనటులు టెక్నిషియన్స్ వంటి వివరాలను ప్రకటించలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూపర్ హీరో గా కనిపించేది జాంబి రెడ్డి సినిమా హీరో తేజ సజ్జ అని తెలుస్తోంది. అయితే దీనిపై ఎక్కడా కూడా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. ఇక ప్రశాంత్ వర్మ గతంలో అ !!, కల్కి, జాంబి రెడ్డి చిత్రాలతో హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement