Monday, April 29, 2024

Praneetha: పెళ్లి త‌ర్వాత గ్లామరో డోస్ పెంచేసిన ప్ర‌ణీత

కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ కన్నడంలో పోకిరి రీమేక్ తో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కన్నడ, తమిళ్ భాషలలో ప్రణీత హీరోయిన్ గా బిజీ అయిపొయింది.

మళ్ళీ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. చివరిగా ప్రణీత తెలుగులో ఎన్ఠీఆర్ కథానాయకుడు సినిమాలో కనిపించింది. హిందీలోకి ఎంట్రీ ఇచ్చి హంగామా 2లో హీరోయిన్ గా సందడి చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. కన్నడంలో ఒక మూవీ కాగా మలయాళంలో ఒక సినిమా ఉంది. ప్రణీతకి 2021లో బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లయింది.

ఆమెకి ఒక కూతురు కూడా ఉంది. అయిన ఏ మాత్రం వన్నె తగ్గని అందంతో సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు ఇన్ స్టాలో నడుము అందాలు చూపిస్తూ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని ఏకంగా 1.63 లక్షల మంది లైక్ చేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement