Friday, May 3, 2024

బాలకృష్ణ పై ప్రగ్యా జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పక్కా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

కాగా ప్రగ్యా బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. అఖండ సెట్స్ లో బాలయ్య చాలా చిల్ గా ఉన్నారని…బాలయ్యతో నటించక ముందు ఆయన గురించి చాలా విన్నానని ముందు ఆయనతో నటన అనేసరికి కాస్త భయపడ్డానని…కానీ సెట్స్ లో మాత్రం చాలా కూల్ గా జోక్స్ వేస్తారని చెప్పుకొచ్చారు ప్రగ్యా. అయితే అఖండ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement