Saturday, April 27, 2024

లైగర్ లో ప్రభుదేవా ? ఏది నిజం !!

అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా లైగర్ సినిమాలో నటించబోతున్నారని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రభుదేవా లైగర్ బృందంతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో నటిస్తున్నాడా లేక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నాడా అనేది మాత్రం క్లారిటీ లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement