Monday, April 29, 2024

‘స్పిరిట్’పై ప్రభాస్ ఫోకస్.. త్వరలోనే సెట్స్ పైకి మూవీ

పాన్ ఇండియా సినిమాలకి రోడ్డేసిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం రెండు పాన్ ఇండియన్ (ప్రాజెక్ట్ కే, సలార్) సినిమాలతో పాటు మారుతితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమాలన్నీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమాల తరువాత.. అర్జున్ రెడ్డీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న స్పిరిట్‌ సినిమాపై ప్రభాస్ ఫోకస్ పెడుతున్నట్లు తాజా సమాచారం.

ప్రస్తుతం సందీప్ డైరెక్షన్ లో రన్బీర్ హీరోగా తెరకెక్కున్న బాలీవుడ్ మూవీ, యానిమల్‌ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి చేసిన అనంతరం, ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించనున్న స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభించనున్నాడు సందీప్. ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, అన్నీ అనుకున్నట్లు గా జరిగితే, ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement