Saturday, May 11, 2024

పవన్ బర్త్ డే మాములుగా ఉండదు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. దీంతోపాటు క్రిష్ దర్శకత్వంలో హరిహారవీరమల్లు సినిమా చేస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా… సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఈ సినిమా నుంచి మొదటి పాట ను రిలీజ్ చేయబోతున్నారట. అలాగే pspk 28 నుంచి కూడా ఓ అదిరిపోయే అప్డేట్ రానుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ తో దుమ్ము దులిపాడు హరీష్ శంకర్. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నాడు. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిల్వనున్నాయట.

Advertisement

తాజా వార్తలు

Advertisement