Tuesday, May 7, 2024

Pawan Kalyan Treat – ప‌వ‌న్ ఫ్యాన్స్ కు పండుగే పండగ‌… ఓజి, ఉస్తాద్ భగ‌త్ సింగ్ మూవీల కొత్త పోస్ట‌ర్లు రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పవర్ ఫుల్ సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మరొకటి యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజి మూవీ.. ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.. ద‌స‌రా పండుగ సందర్భంగా ఈ రెండు మూవీలలోని ప‌వ‌న్ లుక్స్ తో కొత్త పోస్ట‌ర్ల‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.. ఓజీ పోస్ట‌ర్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ రౌద్రంగా క‌నిపించాడు..

ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ల్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను పవన్ కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోలీస్ గా నటిస్తున్న ఈ సినిమా విజయదశమి పండుగను పురస్కరించుకుని మైత్రి మూవీ మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ పోలీస్ యూనిఫార్మ్ లో ఒక సమ్మిటి చేతిలో పట్టుకుని తప్పు చేసిన వారిని శిక్షించే వాడిలాగా ఎంతో ఆవేశంగా ఉన్నఈ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఆయుధ పూజ మరియు దసరా శుభాకాంక్షలు అంటూ మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement