Friday, May 3, 2024

Celebrations – బాలిక స‌ద‌న్ లో రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తుల ద‌స‌రా వేడుక‌లు

హైద‌రాబాద్ – మన కుటుంబ సంస్కృతులను, సంప్రదాయాలను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఎంతైనా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలాంటి బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు ఉపాసన కామినేని కొణిదెల, ఆమె భర్త, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ దంపతులు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి రామ్ చరణ్ ఇంట దసరా ఉత్సవాలను జరుపుకున్నారు. ఉపాసన కుటుంబం తరఫున వచ్చిన ఓ సంస్కృతిని ఆచరించి కొనసాగించారు రామ్‌ చరణ్‌. ప్రతి ఏటా బాలికా నిలయం సేవా సమాజ్‌లోని అమ్మాయిలతో కలిసి రామ్ చరణ్ దంపతులు దసరా పర్వదినాన్ని జరుపుకున్నారు. ఉపాసన బామ్మ, ఈ సేవా సమాజ్‌కి మూడు దశాబ్దాలకు పైగా ఆసరాగా ఉంటూ వస్తున్నారు. ఆమెకు ట్రిబ్యూట్ ఇచ్చేలా ఉపాసన, రామ్‌చరణ్ కలిసి బాలికా నిలయం సేవా సమాజ్ లోని అనాథ బాలికలతో కలిసి ఈ దసరా ఉత్సవాన్ని జరుపుకున్నారు.

ప్రేమను పంచాలి, సానుకూల దృక్పథాన్ని సమాజంలో నాటాలి, సంతోషంగా జీవించాలనే ఆలోచనలను బాలికలలో పెంపొందించేలా చరణ్ దంపతులు ఈ పర్వదినాన్ని నిర్వహించుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని అత్యంత వైభవంగా చాటిచెప్పారు వారు. స్త్రీ శక్తిని ప్రశంసించేలా, ప్రోత్సహించేలా, కొనియాడేలా పర్వదినాన్ని జరుపుకున్నారు చరణ్ దంపతులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement