Saturday, May 18, 2024

పవన్ మారో పాట పాడేశాడట!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హరి వీరమల్లు సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ తో పాటు టాలీవుడ్ హల్క్ రానా కూడా నటిస్తున్నాడు. అయితే ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా పవన్ తనదైన ఓ మార్క్ ని చూపిస్తారట. అది మరేదో కాదు… ఈ సినిమాలో ఓ పాట పాడారట పవన్.

ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పారు. అలాగే పవన్ నుంచి పాట ఒకటే కాకుండా బహుశా ఆ నెంబర్ ఇంకా ఉండొచ్చని కూడా చెప్పుకొచ్చాడు. కాగా థమన్ చేసిన ఈ కామెంట్ సినిమాపై క్రేజ్ ను మరింత పెంచింది. మరి థమన్ మ్యూజిక్ లో పవన్ కళ్యాణ్ ఎలాంటి పాట పాడారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement