Monday, April 29, 2024

క్రిష్ తో మాములుగా ఉండదు….ఒకటి మొత్తం మూడు !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు పవన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి గత కొన్నాళ్లుగా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడట.

ఆ మూడు పాత్రలను కూడా క్రిష్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో పాటు సినీ అభిమానులకు మంచి విసువల్ ట్రీట్ ఉంటుందని అంటున్నారు. ఇక అలాగే వీటితోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement