Wednesday, May 1, 2024

హరీష్ శంకర్ మూవీకి పవన్ రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్..

టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో పవర్ స్టార్ ముందు వరుసలో ఉంటారు. పవన్ కు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్స్ లో ఒకరు. మరి రెమ్యూనరేషన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది కదా ! అందుకే ఈ నేపథ్యంలో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ? అనే విషయంపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.
గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన కోర్టు డ్రామా “వకీల్ సాబ్”కు పవన్ కళ్యాణ్ రూ.50 కోట్లు వసూలు చేశారని గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా ప్రచారం జరిగింది. హిందీ మూవీ “పింక్” రీమేక్ గా రూపొందిన ఈ సోషల్ డ్రామా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం పవన్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారట. తాజా బజ్ ప్రకారం పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్ట్ “పిఎస్పికే28″కు షాకింగ్ రెమ్యూనరేషన్ ను అందుకున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కు ఏకంగా 60 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నారట. ఈ మేరకు పవన్ భారీగా రెమ్యూనరేషన్ పెంచారనే ప్రచారం టాలీవుడ్ లో జోరందుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారు పవన్.

ఇది కూడా చదవండి: RC15: పాన్ ఇండియా మూవీ లాంచ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement