Sunday, May 5, 2024

పాగల్ టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమ దాస్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ ప్రస్తుతం పాగల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అవికాగోర్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రథన్ సంగీతం అందిస్తున్నారు.

తమిళ హిట్ చిత్రం ఓ మై కడవులే చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రామ్ మిరియాల ఈ సాంగును పాడగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement