Friday, April 26, 2024

సమంత శాకుంతలం లో బాలీవుడ్ నటుడు

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా మహాభారతంలోని ఆదిపర్వం… కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇక మలయాళం నటుడు దేవ్ మోహన్ కింగ్ దుష్యంత పాత్రలో నటిస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆయన పోషిస్తున్నాడని సమాచారం. అయితే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన ఎక్కడ కూడా రాలేదు. కానీ నిర్మాత నీలిమ గుణ…కబీర్ బేడి కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనతో పని చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా శాకుంతలం హ్యాష్ టాగ్ ను కూడా పెట్టారు. దీంతో నెటిజన్లు ఆయన ఈ సినిమాలో నటిస్తున్నారాని కన్ఫామ్ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement