Wednesday, May 1, 2024

వన్ వీక్ శ్రీకారం కలెక్షన్స్ !!

నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్రీకారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. ఇక శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. చదువుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రైతుగా ఎలా మారాడు.. సమస్యలను అధిగమించి ఎలా సక్సెస్ అయ్యాడనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ ఆ తరువాత మాత్రం పడిపోయాయి.

మొదటి రోజు 4కోట్లకు పైగా షేర్స్ రాగా రెండవ రోజు నుంచి తగ్గుతూ వచ్చాయి. 5వ రోజు అయితే ఏకంగా 30లక్షలకు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 8.44కోట్ల వరకు షేర్స్ సాధించగా… గ్రాస్ కలెక్షన్స్ 14.20కోట్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో 9.13కోట్ల షేర్స్ ను రాబట్టింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ 15.50కోట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement