Thursday, May 2, 2024

11 సినిమాలు,7 ఏళ్ళు.. నిలబడ్డాడు- హ్యాపీ బర్త్ డే నితిన్

ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు….పోతూ ఉంటారు. అందులో కొంతమంది స్టార్ గా నిలదొక్కుకుంటారు. మరి కొంతమంది ఇంటి బాటపడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన హీరో నితిన్. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత దిల్ ,సై వంటి చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తరువాత సుమారు ఏళ్లపాటు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 11 సినిమాలు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోలేని విధంగా నిరాశ పరిచాయి.

ఆ సమయంలో అందరూ కూడా నితిన్ కెరీర్ అయిపోయిందని అనుకున్నారు. కానీ తన కెరీర్ ప్రారంభంలో ప్రేమ కథతో వచ్చిన నితిన్ మళ్లీ ప్రేమకథతోనే హిట్ కొట్టాడు. ఆ సినిమానే ఇష్క్. వెంటనే గుండెజారి గల్లంతయిందే సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. అక్కడి నుంచి కూడా సక్సెస్ లు కొడుతూ తన ఇమేజ్ ని మళ్లీ వెనక్కి తెచ్చుకున్నాడు. ఇక గతేడాది భీష్మ సినిమాతో కూడా మంచి హిట్ ని అందుకున్నాడు. ఇటీవల వచ్చిన రంగ్ దే సినిమాతో కూడా మరో హిట్ ని అందుకున్నడు. కాగా నేడు నితిన్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే నితిన్ కు సోషల్ మీడియా వేదికగా సినీ స్టార్స్ అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలానే నితిన్ మరిన్ని సక్సెస్ లు సాధించాలని మనం కూడా కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement