Saturday, April 27, 2024

బర్త్ డే స్పెషల్…హరిహారవీరమల్లు నిధి లుక్ రిలీజ్

నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ రోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె లుక్ ను రిలీజ్ చేసింది. ఈ లుక్ లో నాట్యం చేస్తూ నిధి కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా… ఇప్పుడు నిధి లుక్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement