Saturday, May 4, 2024

ఈ నెల 5న.. ద‌స‌రా స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్

హీరో నాని..హీరోయిన్ కీర్తి సురేశ్ జంట‌గా న‌టించిన చిత్రం ద‌స‌రా.. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా, క్రితం నెల 30వ తేదీన థియేటర్లకు వచ్చింది.’దసరా’ సినిమాలో కథ మొదలైన దగ్గర నుంచి హీరో నాని – హీరోయిన్ కీర్తి సురేశ్ ఇద్దరూ కూడా డీ గ్లామర్ రోల్స్ లో కనిపిస్తారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా ఉండదు. కానీ ఆ లోటు ఎక్కడా తెలియదు .. కథ ఎంత మాత్రం బోర్ కొట్టదు. నాని – కీర్తి సురేశ్ కలిసి హిట్ కొట్టిన రెండో సినిమా ఇది. విడుదల రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వసూళ్ల విషయంలో అదే జోరును కొనసాగిస్తూ 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. ఈ నెల 5న ద‌స‌రా మూవీ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ ను క‌రీంన‌గ‌ర్ లో నిర్వ‌హించ‌నున్నారు.అక్కడి ఎస్.ఆర్.ఆర్. గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఇందుకు వేదికగా మారనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.ఈ మధ్య కాలంలో మాస్ కంటెంట్ తో థియేటర్స్ కి వచ్చిన సినిమాలలో ‘దసరా’ ఒకటి.

Advertisement

తాజా వార్తలు

Advertisement