Thursday, May 2, 2024

బ‌ల్లే బ‌ల్లే సాంగ్ లో.. స్టెప్పులు అద‌ర‌గొట్టిన స‌ల్మాన్ ఖాన్

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ .. ఆయ‌న న‌టిస్తోన్న చిత్రాల్లో కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్ ఒక‌టి. ఈద్ సందర్భంగా వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌ 4న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది.తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని ఓ బల్లే బల్లే అంటూ సాగే హుషారైనా పాటను రిలీజ్‌ చేశారు. ఈ పాటలో సల్మాన్స్‌ స్టెప్స్‌ అదిరిపోయాయి. అంతేకాకుండా ఈ పాటకు థియేటర్‌లో ప్రేక్షకులు ఈలలు గోలలతో రచ్చ చేయం ఖాయం. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ పాట కూడా జనాలకు ఇన్‌స్టాంగ్‌గా ఎక్కేస్తుంది. సుఖ్బీర్‌ స్వరపరిచిన పాటను ఆయనే స్వయంగా ఆలపించాడు. ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది. హీరో వెంకటేష్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. టీజర్‌, ట్రైలర్‌లను గమనిస్తే తెలుగు నెటివిటీని కాస్త ఎక్కువగానే దట్టించినట్లు తెలుస్తుంది. మ‌రి ఈ చిత్రం ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో తెలియాల్సి ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement