Saturday, April 27, 2024

ఎన్టీఆర్ పుట్టినరోజునాడు ఒకటే అప్డేట్ @ ఆర్ఆర్ఆర్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా గతంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన సరికొత్త లుక్ ను రాజమౌళి రిలీజ్ చేశాడు.

అయితే మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదట. పుట్టినరోజు సందర్భంగా కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారట. అంతేగాని టీజర్ లాంటివి ప్లాన్ చేయటం లేదని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ పుట్టిన రోజుకు రెండు అప్డేట్స్ అనే వార్తలకు తెరపడినట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement