Thursday, May 2, 2024

ఎన్టీఆర్ కొరటాల సినిమా వచ్చే నెలలోనే స్టార్ట్ కాబోతుంది!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుని ఉన్నాడు. అలాగే స్టార్ కాస్ట్ ను ఎంపిక చేసుకునే పనిలో కూడా ఉన్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కీయరా పేరు వినిపించగా… సంగీతం విషయంలో అనిరుద్ పేరు వినిపిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement