Thursday, May 2, 2024

Jr.NTR : టిల్లు గాడికి ఎన్టీఆర్ విందు ..

ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమైనా.. డీజే టిల్లు తో సిద్ధు జొన్నలగడ్డ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీ 2022లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని మల్లిక్‌ రామ్ తెరకెక్కించారు.

- Advertisement -

మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా ఘన విజయం సాధించింది. 5 రోజుల్లో టిల్లు స్క్వేర్ చిత్రం రూ. 83 కోట్లు గ్రాస్ రాబట్టింది. టిల్లు స్క్వేర్ విజయం పట్ల సినీ ప్రముఖులు సిద్ధు జొన్నలగడ్డను అభినందిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ టీంను అభినందించారు. ఈ మూవీ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎన్టీఆర్.. టీంకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి నిర్మాత నాగ వంశీ, సిద్ధు జొన్నలగడ్డ, హీరో విశ్వక్ సేన్ హాజరయ్యారు. వీరంతా కలిసి తీసుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిల్లు స్క్వేర్ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిత్ర యూనిట్ ను తన ఇంటికి పిలిపించుకున్న చిరు వారిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement