Saturday, April 27, 2024

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్…. అభిమానులు స్టార్ట్ చేసేశారుగా !!

అభిమాన హీరోల పుట్టినరోజులు, పెళ్లి రోజులు వచ్చాయి అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇటీవల కాలంలో అయితే సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ సృష్టిస్తు రికార్డులను నెలకొల్పుతున్నారు. ఇకపోతే మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడే హంగామా స్టార్ట్ చేశారు. జై ఎన్టీఆర్ అని హ్యాష్ ట్యాగ్ తో బర్త్ డే ను ట్రెండ్ చేస్తున్నారు.

ఆయన బర్త్ డే సమయానికి రికార్డు స్థాయిలో ట్రెండ్ సృష్టించి బహుమతిగా ఇవ్వడానికి అభిమానులు పిలుపునిచ్చారు. ఉదయం 10గంటల సమయంలో 12 వేలకు పైగా ట్వీట్లతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ లోకి వచ్చింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఇటీవల కరోనా బారిన పడిన తర్వాత హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు ఎన్టీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement