Thursday, May 2, 2024

విశాఖపట్నంలో రౌడీ గాడో సాంగ్ రిలీజ్ చేసిన నితిన్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ గల్లీ రౌడీ. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాబీ సింహ, వివా హర్ష వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఎంవివి సినిమాస్, కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించారు.

అలాగే సాయి కార్తీక్, రామ్ మిర్యాల సంగీతం అందించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్, లుక్స్ కు మంచి ఆదరణ లభించగా… తాజాగా మరో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విశాఖపట్నంలో రౌడీ గాడో అనే లిరికల్ వీడియో సాంగ్ ను నితిన్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. అంతేకాకుండా సాంగ్ చాలా బాగుందని చిత్ర బృందానికి విషెస్ తెలిపారు.

https://youtu.be/l4DrW6Uh05I
Advertisement

తాజా వార్తలు

Advertisement