Sunday, May 5, 2024

మళ్ళీ మొదలైంది…సుమంత్ పాత్ర రివీల్

టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో కె రాజశేఖర రెడ్డి నిర్మాతగా సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సుమంత్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు చిత్ర యూనిట్. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరో కు పెళ్ళంటే అలర్జీ అంట. అంతే కాదు రిలేషన్ షిప్ స్టేటస్ ? ప్రశ్నార్ధకం అంటూ చెప్పుకొచ్చారు..

ఇక సుమంత్ ఈ సినిమాలో మంచిగా వంట చేయగలడు. ఒంటరిగా ఉండటం ఈ క్వాలిఫికేషన్స్ తో పాత్ర ఉండబోతోందట. కాగా ఇటీవల సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా అది ప్రమోషన్ లో భాగం అని కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక అప్పటి నుంచి కూడా సినిమాలోని కీలక పాత్రధారుల పాత్రలను రివీల్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇంతకుముందు సుహాసిని రోల్ కి సంబంధించి ధైర్య సాహస వంతమైన సింగిల్ మదర్ సుజా పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే పోసాని కృష్ణమురళీ లాయర్ గా కనిపించనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement